
బిగ్ బాస్ విన్నర్ గా నిలవడమే కాదు టాప్ ఫైవ్ లిస్ట్ లో వారి పేర్లు ఉండటం కూడా గొప్ప విశేషమే. అందుకే టాప్ ఫైవ్ లిస్ట్ లో ఉండేందుకు ఇంటి సభ్యులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు, ఇప్పటికే వారి గేమ్ స్టైల్ కూడా మార్చేసారు కొందరు. ఎలాగైనా ప్రస్తుతం టాప్ ఫైవ్ లో నిలవాలన్నది వారి ప్రస్తుత గమ్యం. అయితే ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళేది ఎవరన్నది ఆదివారం తేలిపోనుంది. ఎక్కువగా కాజల్ పేరే వినిపిస్తోంది. కానీ పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. అసలు విషయానికొస్తే సీజన్ 5 టాప్ ఫైవ్ కంటిస్టెంట్స్ ను అనౌన్స్ చేసేందుకు ఈ ఆదివారం ఓ క్రేజీ సెలబ్రిటీ బిగ్ బాస్ స్టేజ్ పైకి రానున్నారని తెలుస్తోంది.
ఇంతకీ ఆ సెలబ్రిటీ మరెవరో కాదు... ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ అని చెబుతున్నారు. బిగ్ బాస్ స్టేజ్ కు మరింత గ్లామర్ తెచ్చేందుకు ఈ గ్లామర్ బ్యూటీ ని స్టేజ్ పైకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న నెటిజన్లు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎపుడెపుడు పాయల్ ను బిగ్ బాస్ స్టేజిపై చూద్దామా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఆదివారం పాయల్ స్టేజ్ పై సందడి చేస్తారో లేదో చూడాలి...