తాజాగా బిగ్ బాస్-5 గత సంవత్సరం డిసెంబర్ 19న ముగిసింది. ఆ ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరి 20వ తేదీన బిగ్ బాస్ -6 ప్రారంభం కావాల్సి ఉంది.. కానీ కరోనా నేపథ్యంలో ఈసారి కూడా కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడితే.. ఫిబ్రవరి 20 న లేదా 27న ఓటిటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నది.అయితే ఈ షో పై తాజాగా వార్త వినిపిస్తున్నది ఏమిటంటే.. ఈ షో 50రోజుల కంటే తక్కువ రోజులు ప్రసారం కాబోతుంది అనే వార్త వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా కంటెస్టెంట్ ఎంపిక కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్లుగా సమాచారం.
బిగ్ బాస్-6 లో కి సోషల్ మీడియాలో ఉండే సెలబ్రిటీలు సైతం తక్కువ రెమ్యునరేషన్ తో తీసుకోబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. ఇక ఇందులో మరొక విషయం ఏమిటంటే.. ఇందులో పాల్గొనేందుకు రెమ్యూనరేషన్ లేకుండా రావడానికి కొంత మంది ఆసక్తి చూపినట్లు గా సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఈసారి కూడా కంటెస్టెంట్ లు నాసిరకంగా ఉండబోతోందని చెప్పవచ్చు అయితే బిగ్ బాస్ నిబంధనల ప్రకారం ఒకసారి ఈ షో లోకి వెళ్ళిన తర్వాత.. మరొకసారి పార్టీసిపెట్ చేసే అవకాశం లేదు.అయితే ఈ సారి మాత్రం పాత కంటెస్టెంట్ లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.