బిగ్ బాస్ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నది నటి హరితేజ.అంతేకాకుండా బిగ్ బాస్ షో తో సెటిల్ అయినది ఎవరన్నా కూడా హరితేజ అని చెప్పవచ్చు.తన ఫస్ట్ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని.. ఆ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత.. సినిమాలలో వరుస అవకాశాలను సంపాదించుకుంది ఈ బ్యూటీ.. ఆ తర్వాత కొన్ని టీవీ షోలను కూడా చేస్తూ.. కమెడియన్గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఇక ఈమె పాడే పాటలకు, హరికథలు కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పవచ్చు. తాజాగా హరితేజ తన ఫాలోవర్స్ తో కొన్ని ముచ్చట్లు పెట్టింది.అందరి నటీనటుల మాదిరి ఈమె కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వంటివి నెటిజన్లతో పంచుకుంది.. ఇక దీంతో ఈమె ఆల్ వేజ్ పాజిటివ్ అని ఒక పోస్టును కూడా చేయడం జరిగింది. ఇక అంతే కాకుండా ఆ పోస్టుకి క్యాప్షన్ గా పాజిటివ్ అంటే ఇప్పుడు అనుకొనే పాజిటివ్ కాదని తెలియజేసింది. డోలో అని రాసి.. సారీ బోలో అనే  విధానంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను తెలియజేసింది హరితేజ. ఇలాంటి చిట్ చాట్ ప్లాన్ చేయడంతో అది కాస్త బెడిసి కొట్టిందనే చెప్పవచ్చు. ఇక కొంతమంది నెటిజన్లు ఈమె వేసిన జోకుల పై సీరియస్ అయ్యారు.ఒక నెటిజన్ మాత్రం హరితేజ కు కరోనా పాజిటివ్ రావాలంటూ ఏకంగా శాపనార్థాలు పెట్టేశాడు. అది చూసిన హరితేజ.. మీకు కూడా కాస్త పాజిటివ్ యాక్టివ్ రావాలి.. అంటూ గాడ్ బ్లెస్ అంటూ కూల్ గా రిప్లై ఇచ్చింది హరితేజ. ఇక అంతే కాకుండా తన కూతురుకి సంబంధించిన కొన్ని విషయాలను కూడా హరితేజను అడగడం జరిగింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ కాస్తా వైరల్ గా మారుతున్నాయి. అయితే ప్రస్తుతం కొన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది హరితేజ.

మరింత సమాచారం తెలుసుకోండి: