
స్టేజ్ పై వీరిద్దరూ కలిసి వుంటే కనిపించే మ్యాజిక్కే వేరు, తెలియకుండానే మనలో ఒక రొమాంటిక్ ఫీల్ మొదలవుతుంది, వీరు చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది, వీరంటే తెలుగు ప్రజలు మనవారు అన్న ఫీలింగ్ తో ఉన్నారు. అలాంటిది ఈ సారి వీరు కొత్త ఢీ షో స్టేజ్ పై కనపడక పోవడంతో వీరి అభిమానులు బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. కొందరైతే నిరాశతో సోషల్ మీడియాలో ఢీ షో యాజమాన్యానికి రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ లు పెడుతున్నారు. కాగా ఇపుడు రేటింగ్ ను పెంచే పనిలో పడ్డారు ఢీ షో నిర్వాహకులు. ఇందు కోసం సుదీర్, రేష్మీలను మళ్ళీ స్టేజ్ పైకి తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నారట.
గతంలో కూడా ఇలాంటి వార్తలు వినపడ్డ ఈ సారి మాత్రం గట్టిగానే అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈ సారి రేష్మీని జడ్జి గా.. సుధీర్ ను యదావిధిగా యాంకరింగ్ చేసేందుకు తీసుకు రాబోతున్నారు అని సమాచారం. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ. ఒకవేళ ఇలా జరిగితే మళ్ళీ ఢీ షో టి ఆర్ పి రేటింగ్ ఒక సాథయికి వెళ్తుంది.