రోజుకో కొత్త సీరియల్ ప్రత్యక్షమవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాకుండా మంచి టైం పాస్ ను కూడా అందిస్తున్నాయి. అలాంటి వాటిలో తాజాగా వచ్చిన సీరియల్ శ్రీమతి శ్రీనివాస్. స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న శ్రీమతి శ్రీనివాస్ వచ్చి కొద్ది రోజులే అయినా ప్రేక్షకాదరణ మాత్రం బాగా చూరగొంటోంది. ఇక ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీదేవికి తల్లి పాత్రలో నటిస్తున్న మీనాక్షి తన అందం, అభినయంతో, నటనతో ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఇంతకు ముందే జెమినీ టీవీలో ప్రసారమైన మొగలిరేకులు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విషయం తెలిసిందే.

ఇక ఈమె పేరు షీలా సింగ్.. భర్త పేరు కళ్యాణ్ కాగా ఆయన క్లాత్ బిజినెస్ చేస్తారు. ఇక ఈ దంపతులకు ఒక బాబు కూడా జన్మించారు. అబ్బాయి పేరు ఇషాంత్. వరంగల్ జిల్లా డోర్నకల్ లో జన్మించింది.. ఇక ఈమె తల్లి తెలంగాణ అయినప్పటికీ తండ్రిది మాత్రం ఉత్తర ప్రదేశ్. ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క ఉన్నారు. అయితే పదో తరగతి చదువుతున్నప్పుడు ఒక సినిమాలో అవకాశం రావడంతో పదవ తరగతి వరకు చదివి ఆ తరువాత సినీ ఇండస్ట్రీ లోకి వచ్చేసింది.


చంటి గాడు , ధైర్యం, నీ మనసు నాకు తెలుసు వంటి సినిమాలలో నటించిన షీలా ఆ తర్వాత ప్రియాంక సీరియల్ ద్వారా బుల్లితెర పై అడుగుపెట్టింది. బొమ్మరిల్లు, మధువాణి,  కన్యాదానం, సావిత్రమ్మ గారి అబ్బాయి మా ఆడపడుచు,నిన్నే పెళ్లాడతా, మొగలి రేకులు,  మట్టిగాజులు వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న షీలా ప్రస్తుతం శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ లో తల్లి పాత్రలో నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సీరియల్స్ ద్వారా మరింత గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది షీలా.. ఏది ఏమైనా ఈమె నటనను ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు సైతం మెచ్చుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: