నేటి తరం యువత ఎక్కువగా సోషల్ మీడియాను ఆధారంగా చేయికుని కెరీర్ ను సెట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా టిక్ టిక్ ఉన్నప్పుడు తమ దైన క్రియేటింగ్ వీడియోలతో సెలబ్రిటీలు గా మారిపోయిన వారున్నారు. అలాంటి వారిలో దుర్గారావు ఒకరు. అయితే అందరూ అలా వచ్చిన ఫేమ్ ను  వాడుకుని సినిమా ఇండస్ట్రీలో రాణించడం కష్టమే అని చెప్పాలి. ఇప్పుడు అదే విధంగా దీపిక పిల్లి అనే ఒక అమ్మాయి టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ బాగా ఫేమస్ గా మారి ఇప్పుడు యాంకర్ గా కొనాగుతోంది.

2018 వ సంవత్సరంలో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపిక అలా ఒక్కో వీడియోతో మొత్తం 10 మిలియన్ ల ఫాలోయర్స్ ను సంపాదించుకుంది. టిక్ టిక్ బ్యాన్ చేసినా తాను ఏదో ఒక విధంగా తన ఫ్యాన్స్ కు దగ్గరగానే ఉంటూ వచ్చింది. అలా తనకు బుల్లి తెరపై యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ విధంగా ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఢీ డ్యాన్స్ షోకు యాంకర్ గా చేసే అవకాశం వచ్చింది. ఇందులో రష్మి తో సో సో గా లాగించింది. ఈ షో తర్వాత మా టీవీ లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాం లలో దూసుకుపోతోంది. అయితే ఇప్పటికీ తాను ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం నిజంగా దురదృష్టం అని చెప్పాలి.

కానీ దీపికకు అందరినీ ఆకట్టుకునే అందం ఉన్నా నటనలో ఇంకా ఇంకా మెరుగు పడాల్సి ఉంది. అయితే తాజాగా దీపిక విడుదల చేసిన ఒక వీడియో నేట్టింట్లో వైరల్ గా మారింది. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో అయినా తనకు సినిమాలలో అవకాశాన్ని తెచ్చి పెడుతుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: