తర్వాత జయ జానకి నాయక, గరం చిత్రాలలో నటించిన ఆ పాత్రలకు ఈమెకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయింది . అందుకే తెలుగులో రాణించలేక పోయినా కన్నడ హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తేర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెరవెనుక బాగోతాన్ని బయటపెట్టి క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఎలా ఉంటారో కూడా ఆమె వివరంగా తెలిపింది.. సినిమాలో చాన్స్ కావాలా.. అయితే నాకేంటి .. నీకేం కావాలి.. అనే తెరచాటు బాగోతం గురించి స్పష్టంగా వివరించింది.. భీమవరం బుల్లోడు సినిమా చేస్తున్నప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. ఇక ఆ సమయంలో ఎన్నో క్యారెక్టర్లు వచ్చాయి... హీరోలు మారుతున్నారు కానీ క్యారెక్టర్ ఒకటే అన్నట్టుగా అయిపోయింది నా జీవితం..
చదువుకుంటూనే మరొకవైపు షూటింగ్ కి వెళ్లేదాన్ని.. పైగా అలాంటి క్యారెక్టర్స్ పదే పదే చేసి నాకు కూడా బోర్ కొట్టేసింది.. ఇక అలాంటి రోల్స్ ప్రతిసారి చేస్తూ ఉండటంతో కొన్ని సినిమాలను వదిలేశాను కూడా.. ఇది ఒక కారణమైతే తెలుగులో పనిచేయడానికి కూడా ఇంకొక కారణం ఉంది.. ఇండస్ట్రీ చూసి చాలా చిరాకుగా.. గలీజ్ గా అనిపించేది.. నేను మంచి ట్రైన్డ్ ఆర్టిస్ట్ ను మాత్రమే కాదు డాన్సర్ ని అలాగే సింగర్ ని కూడా.. టెక్నీషియన్స్ తో కలసి పని చేశాను.. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గానే ముందుకు వెళ్ళాలి అనుకున్నాను కానీ తప్పుడు పనులు చేసి ఆర్టిస్ట్గా వెళ్లాలని అనుకోలేదు.. ఇండస్ట్రీలో కాంప్రమైజ్ అయితేనే అవకాశాలు ఉంటాయి.. ముందుకు వెళ్తారు అని.. లేకపోతే వారిని తొక్కేస్తారు అని ఈ కారణాల వల్ల తెలుగులో నేను హీరోయిన్ గా రాణించలేక పోయాను అని ఆమె తెలిపింది.
ఒకరికి లొంగిపోయి పని చేయాల్సిన అవసరం నాకు లేదు.. నా దగ్గర అన్ని క్వాలిటీస్ వున్నప్పుడు నేనెందుకు ఒకరి పక్క లోకి వెళ్ళాలి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఎస్తేర్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడిగేవాళ్ళు చాలామంది ఉన్నా.. మనం ఎలా మన జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నాము అనేదే కెరియర్.. ఇక అలాంటి గలీజ్ పనులకు నేనెప్పుడూ వెళ్ళను.. సినిమాలు వస్తే చేస్తాను లేకపోతే చెయ్యను నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేనెప్పుడూ వదిలేయను.. అని తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ తెలిపింది.