సినీ ఇండస్ట్రీ అయినా సరే బుల్లితెర అయినా సరే ఎవరైనా చేయరాని పనులు చేసినా లేదా దర్శకనిర్మాతలకు ఎదురుతిరిగితే కచ్చితంగా బ్యాన్ చేయబడతారు.. ఇక సినీ ఇండస్ట్రీలో జమున , శ్రీవాణి వంటివారిని మొదలుకొని బుల్లితెరపై నటుడు సమీర్ తో పాటు ఇటీవల వచ్చిన మరికొంతమంది నటులు కూడా బుల్లితెర నుంచి బ్యాన్ చేయబడ్డారు. ఇక ఈ నేపథ్యంలోనే బుల్లితెర పై ప్రసారమైన పసుపు కుంకుమ అనే ధారావాహిక ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన కన్నడ భామ పల్లవి గౌడ.. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.


అంజలి పాత్రలో నటించి తన నటనతో.. అందంతో.. అభినయం తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది .. ఆతర్వాత సావిత్రి అనే సీరియల్లో కూడా నటించింది. ఇకపోతే కారణాలు ఏమో తెలియదు కానీ కొద్దిరోజుల తర్వాత ఈమె సావిత్రి సీరియల్ నుంచి తప్పుకోవడం జరిగింది. అయితే ఈమె ఎందుకు ఉన్నట్టుండి సావిత్రి సీరియల్ నుంచి తప్పుకొంది.. వేరే ఏదైనా సీరియల్లో అవకాశం వచ్చిందా.. లేక సినిమాలలో అవకాశం వచ్చిందా..అని  అభిమానులు ఎంతగానో తమ అభిప్రాయాలను వెల్లడించారు. కానీ ఆ తర్వాత ఈమె ఫిదా అనే డబ్బింగ్ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మళ్లీ పరిచయమైంది..


ఆ తర్వాత తాను యానిమేషన్ రంగంలోకి అడుగుపెట్టాలని అనుకున్నట్లు తెలిపినా..అనుకోకుండా టీవీ రంగంలోకి వచ్చాను అని తెలిపింది.. మళ్లీ తెలుగు సీరియల్స్ లో పనిచేస్తానని వెల్లడించిన ఆమె ఒక ఇంటర్వ్యూ ద్వారా ఎవరికీ తెలియని కొన్ని రహస్యకరమైన విషయాలను వెల్లడించింది. ఇక ప్రొడ్యూసర్ కౌన్సిల్ తన పై బ్యాన్ విధించింది అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇకపోతే ఎందుకు అనే విషయానికి వస్తే సావిత్రి సీరియల్ చేసేటప్పుడు ఆమె మరో తెలుగు సీరియల్ లో నటించకూడదు అని నిర్మాతలు ఈమె చేత అగ్రిమెంట్ కూడా  తీసుకున్నారాట. అయితే ఇదే చనువుగా చూసిన నిర్మాతలు ఆమెకు సరైన పేమెంట్ కూడా ఇచ్చేవారు కాదని .. రెండు మూడు నెలలపాటు ఇలాగే చేశారు అని.. కుటుంబం పోషణ కష్టమవుతున్న నేపథ్యంలో ఇంకొక సీరియల్లో చేయడానికి ఒప్పుకుందట..

పెండింగ్ పేమెంట్ ఇవ్వమన్నా సరే..వీరు ఇవ్వకపోగా డబ్బు సమస్య ఉంది .. వేరే సీరియల్ లో చేస్తానని చెప్పినా వినక కపోవడం చివరికి ఆమెను బ్యాన్ చేయడం జరిగింది. వ్యక్తిగత జీవితం కూడా సాఫీగా సాగడం లేదని సమాచారం.. తన భర్తతో విడాకులు తీసుకొని దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఇక ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆర్థికంగా మెరుగుపడటానికి ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: