బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రసారం అవుతున్నా అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ గా పేరు పొందింది. అయితే ఇటీవల కాలంలో ఈ సీరియల్లో కార్తీక్,దీపా  ఇద్దరు మరణించినట్లు గా చూపించారు. ఇక రెండు రోజులుగా కార్తీకదీపం సీరియల్ కి సంబంధించి ఒక ప్రోమో తెగ వైరల్ గా మారుతోంది.. ఆ ప్రోమో లో కార్తీక్ - దీప పిల్లలు అయినా, సౌర్య, హిమ లు చాలా పెద్దవాళ్ళు అయినట్టు గా చూపించడం జరిగింది.

ఇందులో ఒకరు ఆటోడ్రైవర్ గా మారగా.. హిమ మాత్రం డాక్టర్ గా మారుతోంది. ఇందులో ఈ హిమాగా నటించినది నటి కీర్తి భట్ ఈమె కూడా అందరికీ సుపరిచితమే. సౌర్య పాత్రలో ఆటోడ్రైవర్ గా కనిపించిన అమ్మాయి కూడా  కొత్త అమ్మాయి. అయితే ఈ అమ్మాయి ఎవరు అనే విషయంపై ఇప్పుడు అందరికీ మొదలైంది.. దీంతో ఈ అమ్మాయి పూర్తి వివరాల కోసం నెట్లో తెగ ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఇక కార్తీక దీపం లో నటించిన ఈ అమ్మాయి కన్నడ అమ్మాయి ఈమె పేరు అమూల్య గౌడ.కర్ణాటకలోని మైసూర్లో 1993 జనవరి 8వ తేదీన పుట్టింది. ఈమె కన్నడలో కమలి అనే నాటికలో నటించింది. అయితే ఈమె నటి కాకముందు ఒక రియాల్టీ షో లో కూడా నటించింది. ఇక 2014 వ సంవత్సరం లో ఈమె స్వాతి ముత్తు అనే కన్నడ సీరియల్ నటించింది. ఆ తర్వాత పునర్ వివాహ అనే హిందీ , కన్నడ సీరియల్స్ లో కూడా నటించింది. కొన్ని సీరియల్స్ లో ఈమె నెగిటివ్ పాత్రలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నది. తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో అవకాశం రావడంతో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సీరియల్స్ తో ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: