మా టీవీలో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇందులో నటించే నటీనటుల కు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.ఇందులో ఎక్కువగా ఆకట్టుకుంటున్న పాత్ర తులసి.. ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను చాలామందిని సంపాదించుకుంది. ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకోవడంతో తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ అయింది ఈమె. ఈమె అసలు పేరు కస్తూరి శంకర్. ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం లో కూడా హీరోయిన్ గా, ఫ్రెండ్ క్యారెక్టర్లు కూడా నటిస్తోంది.అంతేకాకుండా బుల్లితెరపై కూడా నటించి అక్కడ కూడా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అప్పట్లో ఈమే మిస్ మద్రాస్ అనే టైటిల్ కూడా సొంతం చేసుకుంది. మనుషులలో కూడా వ్యాఖ్యాతగా కూడా పనిచేసింది. ఇక తమిళంలో కూడా బిగ్ బాస్-3 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఎంతో బిజీ లైఫ్ ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గానే ఉంటే అప్పుడప్పుడు కొన్ని కౌంటర్లను కూడా వేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక రాజకీయ విషయంలో కూడా బాగా పట్టు ఉండడంతో ఇప్పటికి తెలుగు రాష్ట్రాలలో కొంతమంది నాయకుల పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.ఇక ఈమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.. ఇక ఇప్పటికికూడా తన అందాల ఆరబోతతో పలు క్రేజీ ప్రాజెక్ట్ లను దక్కించుకుంటోంది. తాజాగా ఒక విషయంలో ఎమోషనల్ అవుతూ కస్తూరి శంకర్ ఇస్మార్ట్ జోడి లో పాల్గొనింది. ఇక తన తండ్రి గురించి ఒక విషయాన్ని తెలియజేస్తూ గుర్తుకు తెచ్చుకుంది. చివరి క్షణాలలో తన తండ్రి ఆమెను ఒకటి అడిగారని.. అది కూడా ఆకలి వేస్తోంది రా అని అన్నాడు అని తెలిపింది. అయితే ఆయనకు ఒక వ్యాధి రావడం వల్ల మెదడు చెప్పే పనులు చేతులు , కాళ్లు వినవని తెలియజేసింది. ఆకలి వేసినా కూడా తినడానికి చేతులు రావు అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: