సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె ఒక వైపు నగరి ఎమ్మెల్యే గా, బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే త్వరలోనే ఒక ఉన్నతమైన పదవిని చేపట్టబోతుంది అని గతకొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అది దాదాపుగా కచ్చితంగా ఈమెకే వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుచేత ఎక్కువగా ఈ మధ్య ఈమె ఆలయాలను దర్శించుకుంటూ వాటి చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంది. అయితే తాజాగా మల్లెమాల ఎంటర్టైన్మెంట్ విడుదలచేసిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో ఒకటీ వైరల్ గా మారుతోంది.

అయితే ఇందులో రోజా జడ్జి గా కాకుండా ఉండడంతో.. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ క్యాబినెట్లో ఈమెకు ఒక హోదా కల్పించబోతున్నారు అని మనకు అర్థమవుతుంది. అయితే ఎన్నో సంవత్సరాల నుండి తాను  జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో కి తాను తప్పుకోబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్రోమో లో కూడా ఆమె తప్పుకుని.. కొత్త జడ్జిలకు ట్రైనింగ్ ఇస్తాను అన్నట్లుగా తెలియజేసింది. దీంతో రోజా షో నుంచి తప్పుకోబోతుంది అని మనకు అర్థమవుతోంది.. దీంతో ఈమెకు ఏపీ మంత్రి కన్ఫర్మ్ అయినట్లు గా ఆమె అభిమానులు భావిస్తున్నారు.అయితే ఆమె జబర్దస్త్ ను వదిలి వెళ్ళిపోతే జడ్జిగా ఎవరు వస్తారు అనే విషయంపై ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. అయితే తాజాగా ఇందులో లైలా కనిపించడం జరిగింది. దీంతో ఆమె నెక్స్ట్ జడ్జిగా ఈమె అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఎగిరే పావురం వంటి సినిమాలలో నటించిన లైలా ఇకపై జడ్జి గా ఎలా అలరిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం ఇందులో రోజా లైలా కు ట్రైనింగ్ ఇచ్చినట్లుగా కూడా కనిపిస్తుంది. ఇక ఏప్రిల్ నెలలో ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ లో రోజా కనిపిస్తుందా లేదంటే ఎప్పటిలాగే జబర్దస్త్ లో జడ్జ్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: