బిగ్ బాస్ షో సీజన్ -3 లో పాల్గొన్న శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. శ్రీముఖి ఆ తర్వాత కొంత కాలానికి బుల్లితెర పైనే కొన్ని షో లలో యాంకర్ గా చేస్తూ షో లకే పరిమితమైంది. అయితే ఇప్పుడు మళ్లీ యాంకర్గా బిజీ గా మారిపోయింది. ఈటీవీ ప్లస్ లో తాజాగా జాతిరత్నాలు అనే షో ద్వారా శ్రీముఖి మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ షో ఏప్రిల్ 4వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. అది కూడా రాత్రి 9 గంటలకు ఈ షో ప్రారంభం చేయనున్నట్లుగా సమాచారం.

ఇక ఇందులో జడ్జిగా ఇంద్రజ వ్యవహరిస్తూ ఉండగా..పోసాని కృష్ణ మురళి గెస్టుగా హాజరయ్యారు. ఇక ఆ తరువాత పలువురు కమెడియన్స్ కూడా ఎంటర్ కావడం జరిగింది. ఆ తరువాత ఈ షో లో కి అలనాటి నటి అన్నపూర్ణమ్మ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక శ్రీముఖి పై తనదైన శైలిలో పంచులు వేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. శ్రీముఖి ని ఎక్కడ కనిపించినా కూడా అందరూ రాములమ్మ రాములమ్మ అంటూ ఉంటారని.. కానీ టీవీ ముందర కూర్చున్న వాళ్లు మాత్రం తనని రావద్దు రావద్దు అని అంటూ ఉంటారు అని ఆ విషయం తెలియదని అన్నపూర్ణమ్మ సెటైర్ వేసింది.

ఈ విషయం విన్న శ్రీముఖి ముఖం మార్చుకున్నది. ఆ తరువాత శ్రీముఖిని  RRR చిత్రంలో అడిగారా అని ప్రశ్నించగా.. అందుకు శ్రీముఖి అడగలేదని తెలియజేసింది. అదేంటి నువ్వు మాట్లాడితే ఆర్ఆర్ఆర్ వేసినట్టుగా ఉంటుంది కదా అని ఆమె తెలియజేసింది. అందుచేతనే rrr సినిమా వాళ్ళు నిన్ను పిలవకపోవడం ఏమిటి అంటూ అన్నపూర్ణమ్మ సెటైర్ వేసింది. ఇక  శ్రీ ముఖి పై అన్నపూర్ణమ్మ వేసిన ఈ పంచులు కాస్త బాగా పేలడంతో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. ఆ వీడియో ని మీరు కూడా ఒకసారి చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: