టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు కమెడియన్ ఆలీ. ప్రస్తుతం ఒకవైపు వెండితెర .. మరొకవైపు బుల్లితెర పై కూడా కొనసాగిస్తున్నాడు. ఇక ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమం ద్వారా బాగా పాపులారిటీ సంపాదించు కున్నాడు. ఇక కనుమరుగైన హీరోయిన్లను ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి తీసుకువచ్చి వారి తో కొన్ని విషయాలను అభిమానులకు పంచుతూ ఉంటాడు ఆలీ. ఇక ఈ వారం తాజాగా నటి యమున తన కార్యక్రమానికి గెస్ట్ గా రావడం జరిగింది. వీరిద్దరి మధ్య సంభాషణ ఎంతో సరదా సరదాగా సాగిపోయింది అని చెప్పవచ్చు.


ఇక ఇలాంటి సమయంలోనే నటి యమున తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నది. అలా తనకి జరిగిన ఒక పెద్ద యాక్సిడెంట్ గురించి తెలియజేసింది.. అప్పట్లో ఒక సీరియల్ లో నటిస్తున్నాను.. అది కూడా అమ్మవారి గెటప్లో నటించాను..  షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక హోటల్ దగ్గర ఆగి భోజనం చేద్దామని వెళ్ళాము.. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతూ డోర్ తీయడానికి వెళ్లాను.. ఆ సమయంలోనే సెంట్రల్  కారణంగా డోర్ ఓపెన్ కాలేదని తెలిపింది. ఆ తర్వాత సెక్యూరిటీ అలారం మోగటం మొదలైంది దీంతో అక్కడికి వచ్చిన వ్యక్తి వైర్ కట్ చేసి తనని సెంట్రల్ లాక్ నుంచి విముక్తి చేశారట.

అలా వెళుతూ వెళుతూ ఉండగా ఒక ప్రమాదకరమైన రహదారి వచ్చింది అక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అని తెలిపింది. భయపడుతూనే అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాం అంతలో ఒక బస్సును ఓవర్టేక్ చేసిన లారీ తమ వాహనాన్ని ఢీకొట్టింది.. అని చాలా దూరం వరకు వాహనాన్ని లాక్కొని వెళ్లిందని తెలిపింది. అయితే ఆ సమయంలో డ్రైవర్ బయటపడ్డాడు తను మాత్రం కార్లోనే ఇరుక్కుపోయాను అని తెలిపింది. ఆ తరువాత డోర్ తీసి బయటకు వచ్చాను. ఇక అలాగే తన కారు కూడా కాలిపోయింది అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: