మీనాక్షి అసలు పేరు షిలా సింగ్. ఈమె భర్త పేరు కళ్యాణ్ ఈయన ఒక క్లాత్ బిజినెస్ చేస్తున్నారట. షీలా దంపతులకు ఇశాంత్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఈమె గతంలో కూడా మొగలిరేకులు సీరియల్స్లో కూడా నటించడం తో అప్పట్నుంచి ఈమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈమె తెలంగాణలోని ఉండే వరంగల్ జిల్లా డోర్న కల్ లో పుట్టి పెరిగింది. ఇక షీలా తల్లి తెలంగాణ అయినప్పటికీ తండ్రి మాత్రం ఉత్తర ప్రదేశ్ కు చెందిన వ్యక్తి. ఈమెకు ముగ్గురు అన్నయ్యలు తో పాటుగా ఒక అక్క కూడా ఉన్నది
షీలా సింగ్ పదవ తరగతి చదువుతున్నప్పుడే ఒక ఫిలిం లో అవకాశం రావడంతో ఆమె చదువు గుడ్ బై చెప్పేసి నటనా రంగం వైపు అడుగులు వేసింది. అలా సీరియల్స్ లో సినిమాలలో నటిస్తూ మంచి పేరు సంపాదించుకుంది ఈమె. షీలా నటించిన సినిమాలలో నీ మనసు నాకు తెలుసు, చంటిగాడు, ధైర్యం వంటి మూవీస్ లో నటించింది. ఇక ప్రియాంక సీరియల్ తో బుల్లితెరకు మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత మధువాణి, బొమ్మరిల్లు, మా ఆడపడుచు, మొగలిరేకులు, కన్యాదానం, నిన్నే పెళ్ళాడుతా, తదితర సీరియల్స్ లో నటించింది షీలా. శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ లో ప్రస్తుతం మీనాక్షి పాత్రలో నటిస్తున్నది