ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తో ప్రారంభించి చివరి గా మహేష్ బాబు తో పూర్తి చేశారు. ఇక అంతే కాకుండా ఈ కార్యక్రమానికి ఎంతో మంది యువ హీరోలు ,దర్శకులు కూడా హాజరయ్యి బాలకృష్ణ తో సరదాగా ముచ్చటించడం జరిగింది. ఇక అంతే కాకుండా వారి యొక్క వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఈ కార్యక్రమానికి మంచి హైప్ వచ్చేలా చేశారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే.. అన్ స్టాపబుల్-2 ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయి అనే టాక్ వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాబోతున్న హీరోలను సైతం ఫైనలైజ్ చేసే పనిలో నిర్వాహకులు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి అతిథులుగా చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు రాబోతున్నట్లు గా సమాచారం అందుతోంది. ఇక అందుకు సంబంధించి ఈ కార్యక్రమ పనులు కూడా చాలా శర వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం గురించి అధికారికంగా తెలియజేయబోతున్నట్లుగా అని కూడా టాక్ బాగా వినిపిస్తోంది. మరి ఈ రెండో సీజన్ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.