బుల్లితెరపై యాంకర్ సుమ వ్యాఖ్యాతగా గత కొన్ని సంవత్సరాలుగా రాణిస్తూనే ఉన్నది. దీంతో ఈమెకు మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక బుల్లితెరపై సాగే పలు కార్యక్రమాలలో క్యాష్ ప్రోగ్రామ్ కూడా ఒకటి. గత ఎపిసోడ్తో ఈ కార్యక్రమం తాజాగా 200 ఎపిసోడ్ పూర్తి చేసుకున్నది. ఇలా 200 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడంతో ఈ కార్యక్రమానికి F-3 ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం హాజరు కావడం జరిగింది. ఈ క్రమంలోనే ఇందులో హీరోయిన్ తమన్నా, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సోనాల్ చౌహాన్, సునీల్ వంటి వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో ని సుమ వీరి చేత ఎప్పట్లాగే ఫన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. వీరితో కలిసి పలు రకాలుగా టాస్క్ లు చేస్తూ కడుపుబ్బ నవ్వించింది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో కూడా విడుదల అవ్వడం జరిగింది.. ఈ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ తమన్నా కన్నీళ్లు పెట్టుకున్నట్లు చూపించారు అయితే తమన్నా ఈ కార్యక్రమంలో అలా కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ తమన్నా, సోనాల్ చౌహాన్ కు ఒక టాస్క్ ను నిర్వహించారు. ఈ టాస్క్ లో భాగంగా సుమ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుంటే..అలనాటి నటి మహానటి ఎలాగైతే తమ ఎడమ కంటి నుండి కన్నీటిని కారుస్తుందో అలా ఏడవాలని యాంకర్ సుమ తెలుపుతుందట. ఈ కార్యక్రమంలో నే సుమ తమన్నాను ప్రశ్నిస్తూ ఉంటుంది.. ఈ ఇద్దరిలో ఎవరు డాన్స్ చేసేటప్పుడు మీరు చాలా ఎనర్జిటిక్గా ఫీల్ అవుతారని అడగగా.. అందులో ఎన్టీఆర్, అల్లు అర్జున్ మీద ప్రశ్న వేయగా ఈ ప్రశ్నకు తమన్నా సమాధానం చెప్పలేక పోవడంతో అలనాటి నటి సావిత్రి మాదిరిగా తన ఎడమ కంటి నుండి కన్నీరు కార్చడం జరిగిందట. ఈ ఏడవ టాన్ని ప్రోమో లో హైలెట్ చేసి భారీగా వ్యూస్ సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: