
జబర్దస్త్ కి మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్ నుంచి మొదలు గెటప్ శీను వరకు కూడా అందరూ హీరోలు గా ఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. హీరోలుగా ప్రయత్నాలు చేసిన వారిలో ఒకరిద్దరు పర్వాలేదు అనిపించుకున్న ఎక్కువ శాతం మంది నిరాశనే మిగిల్చారు. ముఖ్యంగా ధనరాజ్ హీరోగా చేయడం వల్ల మళ్ళీ జీరో పరిస్థితి అయిపోయింది. పలు సందర్భాలలో కన్నీళ్లు పెట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హీరో ధనరాజ్ చేసిన సినిమాలు ప్లాప్ అవడంతో పాటు ఆయన నిర్మాతగా కూడా ప్రయత్నించిన సినిమాలు ఫ్లాపులను చూశాయి.
ఇక సుధీర్ కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటివరకు మంచి స్టార్ డమ్ దక్కించుకోలేక పోయారు. గెటప్ శీను కూడా మొదటిసారి సోలో హీరోగా సినిమాలు చేస్తున్నారు. హైపర్ ఆది కి వస్తున్న ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు హీరోగా తన వల్ల కాదు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎలాంటి సినిమా అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఓపెన్గా చెప్పేశారట. దాంతో ఆయన తెలివికి అంతా కూడా చాలా ఫిదా అవుతూ ఉన్నారు. ఇక దీంతో ఆయన అభిమానులు సైతం హైపర్ఆది చాలా తెలివైనవారు అంటూ పలువురు పలు రకాలుగా కామెంట్లు చేయడం జరుగుతోంది.