అయితే ఫైమా ఇందులోకి రావడం వెనక తన లక్ష్యం వేరే ఉందట. ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు జబర్దస్త్ లో తన ప్రయాణం మొదలైన విషయాలను ఒక ఇంటర్వ్యూ ఛానల్ ద్వారా తెలియజేసింది. తన తల్లి బీడీలు చుట్టి.. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతోనే తమకు ఏం కావాలన్నా తెచ్చుకునే వాళ్ళమని తెలియజేసింది. తాము మంచి పేరు సాధించాలని తమ అమ్మ కోరిక అని తెలియజేసింది. చిన్న వయసులోనే తన అక్కాచెల్లెళ్లకు వివాహం అయిందని తెలియజేసింది. తాము మొత్తం నలుగురు అక్క చెల్లెలు అని.. అందులో ముగ్గురికి వివాహం అయిందని కూడా తెలిపింది.
తమ అక్క చెల్లెలు ఎక్కువగా అని మంచి పేరు తెచ్చుకో మని చెబుతూ ఉండేవారట. మంచి పేరు ఎల తెచ్చుకోవాలో తెలియదు.. కానీ మల్లెమాల ద్వారా నేను మంచి పేరు తెచ్చుకున్నానని అలా తమ కల నెరవేరిందని తెలియజేసింది ఫైమా. ఇక ఇక్కడికి రాకముందు తనకు డ్రీమ్ లేదని.. చదువులో కూడా చాలా వెనుకబడేదట. మిషన్లో బట్టలు కుట్టడం నేర్చుకోని తన జీవితాన్ని కొనసాగించాలనుకునేదాన్ని తెలియజేసింది ఫైమా. కానీ అవకాశం రావడం వల్ల తన లైఫ్ మొత్తం మారిపోయింది అని తెలియజేసింది. ప్రస్తుతం ఇల్లు కట్టాలి అనుకుంటున్నాను అని తెలియజేసింది ఫైమా.