ఇకపోతే నిరూపమ్ కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఈ సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ ను ఏర్పరుచుకున్నారు అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ నుంచి తప్పుకున్న డాక్టర్ బాబు తన భార్య మంజులతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు. దీంతో పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులకు తెలియజేయడం జరిగింది. ఇకపోతే తాజాగా వీరి యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉన్నారు.
ఈ విధంగా డాక్టర్ బాబు కార్తీకదీపం రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఇకపోతే కొందరు నెటిజన్లు డాక్టర్ బాబు తన భార్య మంజుల కలిసి ఒకే సీరియల్ నటించక పోవడానికి గల కారణం ఏమిటి అనే ప్రశ్న వేశారు.. ఈ ప్రశ్నకు మంజుల సమాధానం చెబుతూ నిజాలు మాట్లాడుకుంటే ప్రస్తుతం తనకు 36 సంవత్సరాలు తన సీరియల్స్ లో హీరోయిన్ పాత్రలు ఇచ్చే అవకాశం లేదట.. అందుచేతనే నిరుపమ్ ప్రస్తుతం సీరియల్లో హీరో పాత్రలో చేస్తున్నారు ఆయన హీరో కాకుండా ఇతర పాత్రలు చేయలేడు.. కనుక నేను తనతో పాటు కలిసి ఒకే సీరియల్స్లో నటించలేక పోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసింది మంజుల. ఏదైనా వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉందని తెలిపింది.