ఏదైనా సినీ అవార్డు ఫంక్షన్ లలో, స్టార్ నటీనటుల ఈవెంట్లు అయినా సరే సుమ తన మాటలతో మాయ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇతర భాషలకు చెందిన సెలబ్రిటీలను కూడా ఒక రేంజ్ లో ఆటపట్టిస్తూ ఉంటుంది. ఇక సుమ ఉండే విధానం వల్ల ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆమె మాట్లాడే విధానం కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అటువంటి సుమ భవిష్యత్ తరాల వారికి కూడా తను ఒక రోల్ మోడల్ అవుతుందని చెప్పవచ్చు.
అయితే సుమ ఏదైనా సినిమా ఈవెంట్లకు, ఫంక్షన్లకు తీసుకొనే పారితోషకం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. దాదాపుగా అక్షరాల రూ.4 లక్షల రూపాయలు తీసుకుంటోందని అన్నట్లుగా తెలుస్తోంది. సినిమాకి అంత డిమాండు ఉంది కాబట్టి డేట్స్ కోసం ఎంతో మంది దర్శక నిర్మాతలు సైతం ఎదురుచూస్తూ ఉన్నారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమాల సుమ యాంకర్ చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. అందుచేత యాంకర్ సుమ కు అంత డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విషయం కాస్త చాలా వైరల్ గా మారుతోంది. మరి రాబోయే రోజులలో సినిమాలకు గుడ్బై చెప్పబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది.