ఇక యాంకర్ అనసూయ కిషో మొదలు పెట్టినప్పటి నుంచి ఉండి మధ్యలో వెళ్లిపోవడంతో రష్మీ వచ్చింది ఆ తర్వాత మళ్లీ అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక జబర్దస్త్ ను నాగబాబు వీడిన తరువాత రోజా కూడా పదవి రావడంతో ఈ షోకు దూరమైంది. ఆమె వెళ్లిన తరువాత 2013 వ సంవత్సరానికి చెందిన జబర్దస్త్ వాళ్లలో కేవలం రాకెట్ రాఘవ మాత్రమే మిగిలారు. ఈ కమెడియన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చజరుగుతోంది.
జబర్దస్త్ లో చేసిన వారికి ఈ కామెడీ షోలో కాస్త పేరు రాగానే పారితోషకం డిమాండ్ చేస్తూ సినిమాలను నటించేందుకు వెళుతున్నారు. కానీ కమెడియన్ రాఘవ మాత్రం పారితోషక విషయంలో అసలు డిమాండ్ చేయలేదట. అయితే ఆయన స్కిట్ విషయంలో మాత్రం డైరెక్టర్ సలహాలు వింటూ ఉంటాడని సమాచారం. నిర్మాతలకు దర్శకులకు కూడా గౌరవం వేస్తూ ఎంతో గౌరవం పుచ్చుకుంటూ ఉంటాడు రాకెట్ రాఘవ. ఇక అప్పుడప్పుడు అడపాదప సినిమాలలో కూడా నటిస్తూ జబర్దస్త్ ను వదలకుండా సినిమాలలో కూడా ఆఫర్లు సంపాదిస్తూ ఉన్నారు. అయితే జబర్దస్త్ ను మాత్రం ఎప్పటికీ వదలనని గతంలో ఇంటర్వ్యూలో తెలియజేశారు రాఘవ. అయితే రాఘవ జబర్దస్త్ లో ఉండడానికి కారణం ఎక్కువ డిమాండ్ చేయకపోవడం ఇతర చానల్స్ వైపు మొగ్గు చూపకపోవడం వల్లే జబర్దస్త్ లో రాఘవ ఇన్నేళ్లు కొనసాగుతున్నారని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.