
ఇక పంచులు వేయడంలో హైపర్ ఆది కి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. జబర్దస్త్ ద్వారా హైపర్ ఆది కి బాగా కలిసి వచ్చింది జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజీతోనే ఆది తన సొంత ఇంటిని నిర్మించుకున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా నటిస్తున్నారు దీంతో సుడిగాలి సుదీర్ హైపర్ ఆది లాంటి వారు లక్షలలో సంపాదిస్తున్నట్లుగా సమాచారం.
అయితే అది మాత్రం ప్రస్తుతం జబర్దస్త్ వీడిన శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రం ఉన్నారు. హైపర్ ఆది సంపాదన ప్రతి ఏడాది దాదాపుగా కోటి రూపాయల వరకు వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హైపర్ ఆది చదువుకునేటప్పుడు చాలా ఖర్చులు అయ్యాయని అప్పట్లో దాదాపుగా 20 లక్షల రూపాయల వరకు అప్పు అయ్యిందని తెలియజేయడం జరిగింది. ఇక అంతే కాకుండా చదువు పూర్తయ్యాక హైదరాబాద్ కు వచ్చేటప్పుడు తన తండ్రి వేరే వాళ్ళ దగ్గర కూడా కాస్త డబ్బును అప్పుగా తీసుకున్నాడని హైదరాబాదుకు వచ్చిన తర్వాత అభి ద్వారా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే జబర్దస్త్ వచ్చిన తర్వాత తన ఊర్లో ఏకంగా 16 ఎకరాలు కొన్నాడు.. అంతేకాకుండా తన తండ్రికి పదివేలకు పది ఉంగరాలు కూడా చేయించారు. ప్రస్తుతం హైదరాబాదులో ఖరీదైన ఇల్లు కూడా కొనుగోలు చేశారు.