గతంలో హైపర్ ఆది.. రష్మీనీ అవమానించడంతో ఆమె గుర్తు పెట్టుకొని మరి రివేంజ్ తీర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో రష్మీ మాట్లాడుతూ కొత్త టాస్క్ మీ ముందుకు తీసుకొస్తున్నాం.. ఇందులో కొంతమంది ఫోటోలను ఉంచ బోతున్నాము అందులో మీకు నచ్చని వారి ఫోటోలు కారణం చెప్పి తగలబెట్టడం లేదా ముక్కలు చేయడం లాంటివి చేయండి అంటూ ఆమె చెప్పింది. దీంతో రాంప్రసాద్ అక్కడికి వచ్చి ఒక విషయంలో హైపర్ ఆది నాకు నచ్చలేదు అంటూ ఆది ఫోటోను తగలబెట్టేసాడు.
ఇక పరదేశి కూడా అన్ని ఆది అన్నే నాకు.. కానీ ఒక విషయంలో మాత్రం నచ్చలేదు అంటూ ఆది ఫోటోను ముక్కలు చేశాడు. ఇక రష్మీ కూడా హైపర్ ఆది ఫోటోను ముక్కలు చేయడం జరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి యాంకర్ గా సుదీర్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ ని భర్తీ చేయడానికి రష్మీ వచ్చినప్పుడు.. ఓహ్ రష్మీ ఎప్పుడొచ్చావు అని అడగకుండా.. ఎప్పుడు వెళ్తావని అడిగి నన్ను అవమానించాడు అందుకు నేను ఆది ఫోటోను ముక్కలు చేశాను అంటూ ఆమె సమాధానం కూడా చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం..