బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా ఒక వెలుగు వెలుగుతోంది యాంకర్ సుమ. ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ తన సత్తా చాటుతూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నది. ఒకవైపు రియాలిటీ షో లతో పాటు మరొకవైపు సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్, మరొకవైపు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నది అయితే ఇటీవల సుమ సొంతగా ఒక యూట్యూబ్ ఛానల్ ను కూడా మొదలుపెట్టింది అందులో తన కుటుంబానికి సంబంధించి తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆడియన్స్ అడిగే ప్రశ్నలకు సైతం తనదైన స్టైల్ లో సమాధానాలను తెలియజేస్తూ ఉంటుంది. అయితే సుమ అత్తగారు మామగారు ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితం కన్నుమూయడం జరిగింది.


అయితే యాంకర్ సుమకి వాళ్ళ అత్తగారు అంటే చాలా ఇష్టమట తన అమ్మ తర్వాత అమ్మ లాగా తనని బాగ చూసుకుంటూ ఉండేదని తెలియజేసింది. అయితే ఆమె లేకపోవడం తనకు ఇప్పటికీ బాధగానే ఉందంటూ తెలుపుతోంది. సుమ ఎన్ని ఫంక్షన్స్ ఎన్ని షోస్ చేసిన తన పిల్లల్ని దగ్గరుండి తన కన్నా బాగా చూసుకునేది తన అత్తగారు అని తెలియజేసింది. కానీ ప్రస్తుతం ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో తనకు చాలా బాధ వేస్తోంది అని తెలియజేస్తుంది సుమ.



ప్రస్తుతం సుమ తీరిక లేని జీవితం గడుపుతున్న లక్షలలో అభిమానులు సంపాదించుకున్న సుమ తన అత్తగారు లేని లోటు ఎవరు తీర్చలేరని తెలిపింది. సుమ రెండు దశాబ్దాల కాలం నుండి మకుటం లేని మహారాణిగా నెంబర్ వన్ స్థానంలోనే ఇంకా కొనసాగుతూ ఉండడం గమనార్హం సుమ వివాహం 1999 లో జరిగింది ఇక నటుడు రాజీవ్ కనకాలను ఈమె ప్రేమించి వివాహం చేసుకుంది. సుమ మలయాళం అమ్మాయి అయినప్పటికీ తెలుగులో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రాజీవ్ తో పరిచయం ఏర్పడ్డాక ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకొచ్చింది. అంతేకాకుండా తమ కుటుంబం మీద ఏవైనా గాసిప్స్ వచ్చిన తను చాలా బాధపడతానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: