
హౌస్ లోకి ఎంటర్ అయినవారిలో ప్రేక్షకులకు పరిచయం ఉన్నవారు సీరియల్ నటి కీర్తి భట్, నువ్వునాకు నచ్చావ్ ఫేమ్ సుదీప, జబర్దస్ లో రాణిస్తున్న చంటి, ఒకప్పుడు తన అందాలతో అల్లాడించిన అభినయశ్రీ, హీరో మరియు సీరియల్ నటుడు బాలాదిత్య, జబర్దస్ నటి ఫైమా మరియు తెలుగు పాపులర్ సింగర్ రేవంత్ లు మాత్రమే జనాలలో కొంచెం పేరును కలిగి ఉన్నారు. వీరు కాకుండా మిగిలిన వారంతా యు ట్యూబర్స్ మరియు ఇతర రంగాల నుండి వచ్చిన వారు కావడం విశేషం. అయితే బిగ్ బాస్ వరకు రావడానికి మాత్రమే ఫేమ్ ఉపయాగపడుతుంది.
కానీ బిగ్ బాస్ లో మెప్పించి ప్రజల మనసును గెలుచుకుని విజేతగా నిలవాలంటే ఖచ్చితంగా మనము ఏమిటో ప్రూవ్ చేసుకుని తీరాలి. లేదంటే అతి త్వరగా ఎలిమినేట్ అయ్యి ఇంటి దారి పట్టాల్సిందే. ఇక పోతే ఉన్న వారిలో విజేతగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది వీరికే అంటూ ఒక వార్త వినబడుతోంది. ఆ లిస్ట్ లో ఉన్నది చంటి, సింగర్ రేవంత్, బాలాదిత్య మరియు కీర్తి భట్ లలో ఒకరు విజేతగా నిలుస్తారని తెలుస్తోంది.