ఉదయభాను పెళ్లి ఒక మిస్టరీగానే ప్రేక్షకులలో మిగిలిపోయింది. ఇప్పటికీ కూడా ఈ పెళ్లిపై పలు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఉదయభాను టీవీలో ఎంట్రీ కాకముందే 15 సంవత్సరాలకే ఒక ముస్లిం వ్యక్తితో వివాహం జరిగిందట. అయితే కొన్ని కారణాలవల్ల అతడి నుండి విడిపోయి ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తున్నది. అలా ఉదయభాను కెరియర్ లో ఇదొక మచ్చగా మిగిలిపోయింది. ఇక అటు తరువాత కెరియర్ పరంగా దూసుకు వెళ్తున్న సమయంలో విజయ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది.. అయితే విజయ్ మొదట ఉదయభాను కి కార్ డ్రైవర్గా, ఆఫీసులో పనిచేసేవారని పలు రకాలుగా వార్తలు వినిపించాయి . అయితే తను మాత్రం ఏం చేస్తాడో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం చాలా వైరల్ గా మారుతూ ఉన్నాయి. అయితే ఈ వ్యక్తితో వివాహం కోసం ఉదయభాను తమ తల్లిదండ్రులతో కూడా గొడవ పడినట్లు సమాచారం.
అలాంటి గొడవలు కారణంగానే ఉదయభాను కెరియర్ కాస్త గందరగోళానికి గురైందని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆమె సన్నిహితుల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు ఉదయభాను ప్రేమ వ్యవహారం కారణంగానే బుల్లితెరపై అంతగా తన జోరు చూపించలేకపోతోంది అని సమాచారం. ఉదయభాను నిర్ణయం సరైనది అయినప్పటికీ ఆ సమయంలో ఆమె తల్లి ఆమెకు మద్దతు చెప్పకపోవడం వల్ల ఆమె కెరియర్ ఇలా ఒడిదుడుకులైందని కొంతమంది విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఉదయ భాను కి ఇద్దరు పిల్లలు. ఉదయభాను , విజయకుమార్ ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.