అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో హైపర్ ఆది కనిపించడం జరిగింది. ఇక హైపర్ ఆదికి మళ్లీ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్రలు హైపర్ ఆది నటిస్తున్నాడని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. హైపర్ ఆది కి ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో హరిహర వీరమల్లు చిత్రంలో డైరెక్టర్ తన పాత్రను క్రియేట్ చేసినట్లుగా సమాచారం.
హైపర్ ఆది ,పవన్ కళ్యాణ్ కలిస్తే ఖచ్చితంగా ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఒకప్పుడు కమెడియన్ ఆలీతో పవన్ కళ్యాణ్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి.. అలాంటి స్థానంలో హైపర్ ఆది వచ్చి చేరాడని చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస సినిమాలో కూడా హైపర్ ఆది ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి ఆఫర్లు ఎన్ని వచ్చినా కూడా.. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోలను మాత్రం వదిలిపెట్టడం లేదు. మరి వెండితెర పైన తన హవా కొనసాగిస్తారేమో చూడాలి హైపర్ ఆది.