జబర్దస్త్ ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుదీర్ ,రష్మీ ,గెటప్ శ్రీను, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, చలాకి చంటి, తదితర కమెడియన్లు ఉన్నారని చెప్పవచ్చు. ఇక అంతేకాకుండా మల్లెమాలవారు ఎక్కువగా ఇందులోని కంటెస్టెంట్లను జోడిగా చూపిస్తూ ఉంటారు. అలా ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. జబర్దస్త్ లో నూకరాజు మరియు ఆసియా లవ్ స్టోరీ మీద కూడా అప్పు డప్పుడు కొన్ని స్టోరీస్ వినిపిస్తూ ఉంటాయి.


అయితే వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారా అనే విషయము వారి సన్నిహితుల ద్వారా కొంతమంది తెలుసుకోవడం జరిగింది. అయితే వీరిద్దరూ ప్రేమించుకోవడం వీరి ఇరువురు కుటుంబాలకు కూడా ఇష్టమే అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు సమయం దొరికినప్పుడల్లా వీరిద్దరి కుటుంబాలకు వెళుతూ వస్తూ ఉంటారట. ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే వీరిద్దరూ కచ్చితంగా లవ్ లోనే ఉన్నట్లు గా అభిమానుల సైతం భావిస్తున్నారు. ఇక వీరిద్దరూ కూడా యూట్యూబ్లో పలు రకాల వీడియోలు అప్పు డప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. జబర్దస్త్ లో కలిసి కనిపించకున్నా వీరిద్దరూ మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ లో అప్పు డప్పుడు సందడి చేస్తూ ఉంటారు.


కనుక వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని చెప్పవచ్చు. అయితే ఈ రంగుల ప్రపంచంలో జనాలను ఆకట్టుకోవడానికి ఎంతోమంది పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలా వీళ్ళు కూడా అదే దారిలో నడుస్తారా లేదంటే నిజజీవితంలో వివాహం చేసుకుంటారా లేదా అనే విషయం చూడాలి. నూకరాజు మాత్రం ఇప్పుడిప్పుడే జబర్దస్త్ నుంచి బయటకు వస్తూ సినిమాలలో కూడా పలు అవకాశాలను దక్కించుకుంటూ ఉన్నారు. కనుక ఈ సమయంలోనే ప్రేమ పెళ్లి అనే కాన్సెప్ట్ మంచిది కాదేమో అని నూకరాజు అభిమానులు భావిస్తున్నారు. మరి వీరి ప్రేమ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: