ఇతని వలన హిందీ బిగ్ బాస్ కూడా ఇంత వరకు ఎప్పుడూ లేని విధంగా వివాదాల పాలయింది. ఆ మధ్యన మీ టూ ఉద్యమం సమయంలో... హీరోయిన్ లను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా సాజిద్ ఖాన్ ను బాలీవుడ్ ఒక సంవత్సరం పాటుగా ఇండస్ట్రీ నుండి వెలిసింది. అయితే ఈ సమయం కాస్త తీరిపోవడంతో డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇది తెలిసిన నెటిజన్లు ఈయనను వెంటనే బయటకు పంపెయ్యాలని సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటున్నారు.
పైగా సాజిద్ ఖాన్ కారణంగా బిగ్ బాస్ షో కు టి ఆర్ పి రేటింగ్ లు కూడా ఒక రేంజ్ లో వస్తున్నాయట.. అందుకే ఈ విషయాన్ని పట్టించుకోకుండా సాజిద్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారని తెలుస్తోంది. ఇక తెలుగులోనూ బిగ్ బాస్ ను నిషేధించాలని కోర్ట్ లకు వెళ్లిన ఉపయోగం లేకుండా పోయింది. అదే విధంగా హిందీలో కూడా జరుగుతోంది.