సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్క సెలబ్రిటీలు సైతం తమకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో సెలబ్రెటీలు అయిన వారు సినిమాలలో కూడా పలు అవకాశాలను అందుకుంటూ ఉంటారు. అలా ఎంతో పాపులారిటీ సంపాదించిన దేత్తడి హారిక సెలబ్రిటీ హోదాను అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చేస్తూ చాలా సెలబ్రెటీలుగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక అంతే కాకుండా ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక యూట్యూబ్లో ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసి అందులో పలు వీడియోలను సైతం షేర్ చేస్తూ బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది.

అంతేకాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్  కూడా సంపాదించుకుంది దేత్తడి హారిక. ఇక ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తో బిగ్ బాస-4 లో కూడా అడుగుపెట్టి మరింత పాపులారిటీ సంపాదించింది. ఇక ఇందులో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా టైటిల్ విన్నర్ అభిజిత్ తో బాగా క్లోజ్ అయిందని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ తోనే మరింత సెలబ్రిటీ హోదా సంపాదించుకున్న ఈమె మరొక కంటెస్టెంట్లతో కలిసి బయట బాగా సందడి చేస్తూ ఉంటుంది.


అంతేకాకుండా ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది అందులో బాగానే సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్న ఈమె తన హాట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై అంతగా అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది దేత్తడి హారిక. ఎక్కువగా సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అప్పుడప్పుడు కొన్ని అడ్వటైజ్మెంట్లలో కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి హారికాకు బిగ్ బాస్ షో కు రాకముందు మంచి క్రేజ్ ఉండేది. అప్పట్లో ఆమె చేసే వీడియోలు కూడా చాలా హైలెట్ గా మారుతూ ఉంటాయి. ఇదంతా పక్కన పెడితే దేత్తడి హారిక అభిమానులతో ముచ్చటించింది మీ జీవితంలో మీ డిప్రెషన్ను ఎలా జయించగలిగారు అనే ప్రశ్న ఎదురవగా అందుకు హారిక తను డిప్రెషన్ అనేది లేదని నాకు తెలియకుండానే నా జీవితం కొనసాగుతోంది అని డిప్రెషన్ వస్తే ఎక్కడ ఆగిపోను అంటూ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: