అలా పాపులారిటీ దక్కించుకున్న ఈయన రాంప్రసాద్, గెటప్ శ్రీను వంటి టీం సభ్యులు దొరకడంతో టీం లీడర్గా ఎదిగి సుమారుగా కొన్ని వందల స్కీట్లు చేశారు. అంతే కాదు ఇప్పటికీ వీరి ముగ్గురు కలయికలు వచ్చే స్కిట్ల కోసం అభిమానులు అంతలా ఎదురుచూస్తూ ఉంటారు.
ఇకపోతే బుల్లితెర ఇండస్ట్రీలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలతో పాటు ఢీ వంటి డాన్స్ కాంపిటీషన్ కి కూడా యాంకర్ గా వ్యవహరించారు. కానీ సినిమాలలో వరుస ఆఫర్లు వస్తుండడంతో వీటన్నిటికీ కూడా గుడ్ బై చెప్పేసారు సుధీర్
ఈ క్రమంలోని సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత త్రీ మంకీస్ సినిమా తెరకెక్కించిన కూడా అది పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. కానీ ఇప్పుడు గాలోడు సినిమాతో మన ముందుకొచ్చిన సుధీర్ పర్వాలేదనిపించుకుంటున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఎంత పారితోషకం తీసుకున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుధీర్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.60 లక్షలు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.