ఈ వారం కనుక సేవ్ అయితే ఖచ్చితంగా మిగిలిన ఏడుగురికి టాప్ 5 లో చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలా కసిగా ఈవారం ఆట కొనసాగుతుంది, అదే సమయంలో పోటీని మరింత రసవత్తరంగా మార్చడానికి బిగ్ బాస్ కఠినమైన టాస్క్ లను ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక శనివారం హౌస్ లోకి వచ్చిన పోటీదారుల కుటుంబ సభ్యుడు మరియు మద్దతుదారులు భావిస్తున్న ప్రకారం కేవలం ఒక్కరు మినహాయించి మిగిలిన ఎనిమిది మంది కూడా ఇంటిలో ఉన్న అందరికీ బలమైన పోటీదారుడు రేవంత్ నే అని చెప్పారు. వాస్తవంగా రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారు.
ఇక కొన్ని సోషల్ మీడియా చానెళ్లు అయితే బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా రేవంత్ అని ఖచ్చితంగా చెబుతున్నారు. బిగ్ బాస్ లో ముగిసిన 5 సీజన్ లలో కూడా ఎక్కువగా సోషల్ మీడియా చానెళ్లు చెప్పిన కంటెస్టెంట్ లు మాత్రమే విన్నర్లు గా మారారు. అలా చూసుకుంటే రేవంత్ విన్నర్ అవుతాడన్నది తెలుస్తోంది. అయితే ఆట ఏమాత్రం ఆడకుంటే కూడా ప్రేక్షకులు రేవంత్ ను గెలిపిస్తారు అంటే మాత్రం పొరపాటు పడినట్లే. ఖచ్చితంగా ఈ మూడు వారాలు ఇంకా కసిగా ఆడితేనే మిగిలిన వాళ్ళ కన్నా ఎక్కువ ఓట్లు పడి విజేతగా నిలుస్తాడు, లేదంటే కీర్తి, ఇనాయ మరియు సత్య లాంటి వాళ్ళు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు.