బిగ్ బాస్ సీజన్ 6 లోకి రాక ముందు వరకు ఇనాయా సుల్తానా గురించి ఎవ్వరికీ అంత ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. తాను చెబుతున్న ప్రకారం ఇండస్ట్రీ లో నటిగా ఎదగాలని చాలాకాలంగా ప్రయత్నించినా గడ్డుకాలమే ఎదురయింది. అయితే తనకు సాక్షాత్తూ ఆ దేవుడి రూపంలో బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే అవకాశం లభించింది. మొదటి రెండు మూడు వారాలు కొంచెం వేరే ట్రాన్స్ లో ఉన్న ఇనాయా, ఆ తర్వాత వారం నుండి ఇంటి సభ్యుల పాలిట జేజేమ్మలాగా మారిపోయి తన పవర్ ఏమిటో చూపిస్తూ వస్తోంది. కానీ మధ్యలో ఒక్క వారం మాత్రం సూర్యతో క్లోజ్ గా మూవ్ అవుతూ ఆటను బాగా నిర్లక్ష్యం చేసింది.

ఆ తర్వాత సూర్యకు దూరంగా ఉన్నా తనపై ఇష్టాన్ని మాత్రం పక్కన పెట్టలేకపోయింది. ఒకానొక సమయంలో డైరెక్ట్ గా బిగ్ బాస్ తోనే సూర్య నా క్రష్ అంటూ చెప్పింది. ఈ మాట ఇంటిలో సభ్యులు మరియు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. ఇక అనుకోకుండా సూర్య ఎలిమినేట్ అవడంతో, ఇనాయా ఎంతలా బాధపడిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తన మైండ్ లో సూర్య అంటే ఒక రకమైన పిచ్చిని ఎక్కించుకుంది. అందుకే తాను వాడిన వస్తువులను సైతం వాడుకుంటూ ఇంట్లో అందరికీ చిరాకు తెప్పించింది అనుకోండి. సూర్య పేరుతో అందరూ తనను భయానకరంగా టార్గెట్ చేశారు. అలా అన్ని రకాల ఒత్తిళ్లకు తలొగ్గి ఇప్పుడు అసలు సిసలైన గేమర్ గా మారింది.

హౌస్ లో స్ట్రాంగ్ ఆటగాళ్లుగా పేరున్న రేవంత్, శ్రీహన్ మరియు ఆదిరెడ్డి లాంటి వాళ్లకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే శనివారం హౌస్ లోకి ఇనాయా కోసం తన తమ్ముడు మరియు సోహెల్ లు వచ్చారు. అప్పుడు అసలు విషయం బయటపడింది, సూర్య తనకు క్రష్ కాదు ఏమీ కాదు, మొదటగా తనకు హైదరాబాద్ కు వచ్చిన కొత్తల్లో సోహైల్ మీద క్రష్ ఏర్పడిందట. అతని కోసం తన ఇంటిని మణికొండకు మార్చుకుంది, అంతే కాకుండా సోహైల్ వర్క్ అవుట్ చేస్తున్న జిమ్ లో కూడా జాయిన్ అయింది. అంతలా తనపై ఇష్టం పెంచుకుంది. పైగా బిగ్ బాస్ లో మాత్రం సూర్య పై ప్రేమ ఉన్నట్లు హొయలు ఒలకబోసింది. శనివారం ఎపిసోడ్ చూసిన వారంతా ఇనాయా చేసిందంతా డ్రామానా అని ఖచ్చితంగా ఫీల్ అయి ఉంటారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: