ఇదిలా ఉండగా అమ్మాయిలతో బావ అనిపించుకునేందుకు.. లవర్ గా పిలిపించుకునేందుకు ఆరాటపడే హైపర్ ఆదికి పెద్ద షాక్ తగిలింది. హీరోయిన్ ఆయనని అన్నయ్య అని పిలిచింది. షో వేదికపై అందరూ ముందు ఆమె అన్నయ్య అని పిలవడంతో గట్టిగా హర్ట్ అయిన ఆది షో నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయి ట్రాక్ ఎక్కి మరి నిరసన తెలియజేశాడు. ఆ మాటను వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఇక్కడే ఉండిపోతానని కూడా హెచ్చరించారు. అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి ముఖచిత్రం సినిమా యూనిట్ వచ్చింది. ఈ నెల 9 న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో , హీరోయిన్ వికాస్ , వశిష్టాప్రియ వడ్లమాని, సినిమా రైటర్ సందీప్ రాజ్, దర్శకుడు గంగాధర్ పాల్గొన్నారు.
అయితే హీరోయిన్ రాగానే కాసేపు ఆమెతో పులిహోర కలిపాడు. హైపర్ ఆది మిమ్మల్ని మంచి హుషారుగా ఉన్నప్పుడు చూశాను అంటూ ఆమెను గుర్తు చేసుకున్నాడు. హుషారు సినిమాలో పాట వేయడంతో ప్రియా సిగ్గులు మోగేసింది. ఈ సినిమాలో సన్నివేశం చెబుతున్న క్రమంలోనే ప్రియా అన్న అని పిలిచింది.. ఇది తట్టుకోలేకపోయినా అది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతేకాదు నిరసన కూడా చేసేసరికి ప్రియా మాత్రం .." అన్నయ్య మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను" అని అనడంతో.." అన్నయ్య అంటుంది.. తట్టుకోలేను అంటుంది ఎవర్రా ఇది" అంటూ అది ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.