కడప ప్రాంతానికి చెందిన వినోద్ హైదరాబాదుకు వచ్చి అనుకోకుండా జబర్దస్త్ టీం లో లేడీ ఆర్టిస్టుగా బాగా పేరు సంపాదించారు. ముఖ్యంగా చమ్మక్ చంద్రతో కలిసి అనేక స్కిట్లు పంచుకోవడం జరిగింది.అయితే కొన్నాల నుంచి ఈ కమెడియన్ జబర్దస్త్ కి దూరమయ్యారు. అలాగే ఇతర చానల్స్ లో కూడా పెద్దగా కనిపించలేదు. కేవలం తన గురించి ఎలాంటి వార్తలు కూడా బయటికి రాలేదు దీంతో తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు వినోద్.
వినోద్ తన భార్యతో సహా మాట్లాడుతూ తనకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇలా మారిపోయానని తెలియజేశారు. దీనివల్ల హెయిర్ లాస్ ఎక్కువగా అయ్యిందని ఇప్పుడు కొంచెం కొంచెం పర్వాలేదని తెలియజేశారు .తనకి తన భార్య అండగా ఉండడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు వినోద్. అయితే తాను ఒక వ్యక్తిని నమ్మి సుమారుగా రూ .20 లక్షలకు పైగా నష్టపోయానని తెలిపారు. హైదరాబాదులో ఎలా అయినా ఇల్లు కొనుక్కోవాలని ఉద్దేశంతో తను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఒక అపార్ట్మెంట్ ని తీసుకోవాలని ఆ ఇంటి ఓనర్ కు రూ.13 లక్షలు ఇచ్చానని.. కేవలం 10 లక్షలు మాత్రమే రాతపూర్వకంగా ఉందని మిగిలిన రూ .3లక్షలు మాటమీదే ఇచ్చానని. కానీ అతని మీద డౌట్ వచ్చి డబ్బులు వాపస్ ఇవ్వమని అడగగా అతను అడ్డం తిరిగాడని తెలియజేశారు దీంతో ఇప్పటికి ఆ డబ్బు కోసం తిరుగుతున్నానని తెలిపారు వినోద్.