
వరుసగా ఆఫర్లు వస్తున్న కారణంగా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేస్తున్నట్లు అనసూయ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అసలు విషయం ఏమిటంటే సినిమాలలో ఆఫర్లు రావడం లేదని అయినా కూడా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసిందని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హాయిగా వారానికి ఒకరోజు జబర్దస్త్ కార్యక్రమానికి డేట్లు కేటాయించి.. మిగతా అన్ని రోజులు సినిమాలలో నటిస్తే బాగుండేది కదా అంటూ కూడా మరి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.
ఈ సమయంలోనే ఆమెకి సంబంధించి సినిమాలు మరియు ఇతర విషయాలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన సినిమాల్లో ఆమె పెద్దగా సందడి చేస్తున్న దాఖలాలు లేవు. జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అభిమానులు ప్రశ్నిస్తున్నారు పూర్వ వైభవం రావాలి అంటే మళ్ళీ ఆమె జబర్దస్త్ లోకి రావాల్సిందే అంటూ కూడా చెబుతున్నారు మరి అనసూయ ఏం కోరుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. కానీ అనసూయ సన్నిహితులు మాత్రం బిజీగా ఉందని వరుసగా సినిమాల్లో నటిస్తోందని చెబుతున్నారు. మరి అనసూయ ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.