ఈటీవీలో ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో వల్ల ఎంతోమంది పాపులర్ అయ్యారు. అందులో ముఖ్యంగా హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రష్మీ, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి, అనసూయ తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఇందులో కొంతమంది జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లిపోవడం జరిగింది. మరికొంతమంది అలా వెళ్లి తిరిగి రావడం కూడా జరిగింది. గడిచిన కొద్ది రోజుల క్రితం హైపర్ ఆది కూడా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పినట్లే అన్నట్లుగా బుల్లితెరవర్గాల నుంచి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అనసూయ ,సుధీర్ కూడా వీటికి గుడ్ బై చెప్పి సినిమాలలో బిజీగా ఉన్నారు.



జబర్దస్త్ యొక్క స్టార్ కమెడియన్స్ కూడా బయటికి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సుడిగాలి సుదీర్ టీమ్ కు చెందిన రాంప్రసాద్ మరియు గేటప్ శీను ఇద్దరు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్లుగా వీరి సన్నిహిత వర్గాలనుంచి వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్ వెళ్లిపోయిన తర్వాత వారి టీంలో పలుమార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఈ మార్పుల విషయంలో రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను సంతృప్తిగా లేరని సమాచారం .అందుచేతనే వీరు కూడా జబర్దస్త్ వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


త్వరలో మల్లెమాలవారు  నిర్వహించే  కొన్ని షోలకు రాంప్రసాద్ గెటప్ శ్రీను గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రాంప్రసాద్, గెటప్ శ్రీను కూడ ఇతర చానల్స్ కి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఒక ప్రముఖ ఛానల్లో మొదలవుతున్న ఒక కొత్త షోకి కొంతమంది కమెడియన్లు అంతా ఆ షోలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జబర్దస్త్ ఇప్పటికే కొంతమంది కమెడియన్లు లేక చాలా బోసిపోయినట్లుగా కనిపిస్తోంది. మరి రాంప్రసాద్, గెటప్ శ్రీను వెళ్ళిపోతారని ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే వీర స్పందించక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: