తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక స్టార్టమును సంపాదించారు యాంకర్ ప్రదీప్. ఇక హీరోగా పలు చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో బుల్లితెర పైన పలు షోలలో యాంకర్ గా చేస్తూ ఉన్నారు. ఇక అంతే కాకుండా వచ్చిన సినిమాలలో పలు క్యారెక్టర్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రదీప్. మొదటిసారి గడసరి అత్త సొగసరి కోడలు అనే ప్రోగ్రాం ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఈ షో పాపులర్ కావడంతో ఆ తరువాత ఎక్స్ప్రెస్ రాజా షో తో అమ్మాయిలకు ఫేవరెట్ యాంకర్ గా మారిపోయారు.

అలాగే ఢీ షోకి హోస్ట్ గా కూడా చేశారు. అయితే అభిమానులు మాత్రం ప్రదీప్ వివాహం గురించి ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటారు. పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా కూడా హీరో ప్రభాస్ తర్వాతే అంటూ దాటి వేస్తూ ఉంటాడు ప్రదీప్. గత కొన్ని రోజుల నుండి ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారౌతుని వివాహం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి తాజాగా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే షోలో ప్రదీప్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది.


ఈ షోలో సంగీత దర్శకుడు రఘు కుంచే గెస్ట్ గా రావడం జరిగింది. రావడంతో ప్రదీప్ పెళ్లి గురించి అడుగుతూ కొన్ని రోజుల నుంచి నీ పెళ్లి గురించి ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి అందులో ఆ అమ్మాయి నిజమేనా అంటూ అడిగారు..ప్రదీప్ ఎందుకు సమాధానం తెలియజేస్తూ ఆ అమ్మాయి ఎవరు నాకు కూడా తెలియదు.. చూస్తే నేను కూడా షాక్ అవుతాను అసలు ఇంటర్నెట్లో తన పెళ్లి గురించి వార్త చూసే నేను ఒకసారి షాక్ అయ్యాను అంటూ తెలియజేశారు. కానీ ప్రదీప్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరిలో కచ్చితంగా వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి వివాహం చేసుకొని ఇలాంటి విషయాలకు పుల్ స్టాప్ పెడతాడరెమో చూడాలి మరి ప్రదీప్.

మరింత సమాచారం తెలుసుకోండి: