సుధీర్ చేసిన తప్పు ఏమిటంటే ఈటీవీ మల్లెమాలను వదిలేయడం అన్నట్లుగా తెలుస్తోంది. హైపర్ ఆది మాదిరిగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కొనసాగుతూ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలివేయడం వంటివి చేశారు. ఇలా సుధీర్ కూడా చేసి ఉంటే బాగుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ సుదీర్ మాత్రం రెండిట్లో కూడా లేకుండా ఉండడంతో అక్కడ రేటింగ్ కూడా పెద్దగా రావడం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సుధీర్ కూడా ప్రస్తుతం ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తున్నారు హీరోకు వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఎంతవరకు అవకాశాలు దక్కించుకుంటాడనే విషయం ఎవరు చెప్పలేము.
జబర్దస్త్ లో చేస్తున్న సమయంలో స్పీడు ఉన్న సుధీర్ ప్రస్తుతం లేరని వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ కార్యక్రమం చేస్తున్నప్పుడే వరుసగా సినిమా ఆఫర్లు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు పాపులారిటీ తగ్గడంతో పాటు సినిమా ఆఫర్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.బుల్లితెర సూపర్ స్టార్ అంటు సుడిగాలి సుదీర్ ని అభిమానులు ఆరాధించారు. కానీ ఆయన మాత్రం తనకు సినీ ఇండస్ట్రీ ముఖ్యమని అటువైపుగా వెళ్లిపోయారు. ఇక అక్కడ చాలామంది స్టార్స్ ఉన్నారు కనుక సుధీర్ ని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పవచ్చు. సుధీర్ బుల్లితెర రంగంలో ఉండి ఉంటే కచ్చితంగా అంతకుమించి క్రేజ్ సంపాదించే వారిని చెప్పవచ్చు. చేజేతులారా కెరీయర్ని ఇలా చేసుకున్నారంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.