
అలాగే యూట్యూబ్లో కూడా కొత్త ఛానల్ ను ఏర్పాటు చేసి కొన్ని షార్ట్ వీడియోలు కూడా చేస్తూ అందులో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రీతూ అంటే ప్రతి ఒక్కరికి బాగా పరిచయమే. కేవలం బుల్లితెర ప్రేక్షకులకు మాత్రమే కాదు వెండితెర ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితం.. ఎక్కువగా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ పేరు తెచ్చుకున్న రీతూ చౌదరి గోరింటాకు సీరియల్ ద్వారా తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇంటిగట్టు, అమ్మ కోసం వంటి సీరియల్స్ లో కూడా చేసిన ఈమె సీరియల్ నటిగా కూడా పేరు సంపాదించుకుంది. జబర్దస్త్ లో తోటి కమెడియన్స్ తో రచ్చ చేస్తూనే ఒకవైపు సీరియల్స్ మరొకవైపు సినిమాలు.. ఇంకొకవైపు సోషల్ మీడియా అంటూ చాలా క్రేజీ తెచ్చుకుంది. అంతేకాదు వరుస గ్లామర్ ఫోటోషూట్లతో యువతకు చెమటలు పట్టించింది.
