
ఇండస్ట్రీలో స్టార్ నటిగా కొనసాగుతున్న సమయంలోనే.. ఒకప్పుడు ఉన్నట్టుండి కెరియర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది.. అందుకోసమే ఆమె చేసిన ఒక తప్పే అని ఆమె సన్నిహితులు కూడా చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే తన దగ్గర కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న విజయ్ కాంత్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించి మరి పెళ్లి చేసుకుంది. అయితే ఈ వివాహానికి ఉదయభాను తల్లిదండ్రులు ఏమాత్రం అంగీకరించలేదు.. పైగా తల్లిదండ్రుల మాటలు వినకుండా బయటకు వెళ్లి అతడిని వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రులు కూడా పరువు పోయింది అని వార్తలు వినిపించాయి ఈ వివాదంలో ఉదయభాను పూర్తిస్థాయిలో రూమర్స్ కి కూడా గురి అయింది.
మొత్తానికి అయితే ఉదయభాను తన కుటుంబ సభ్యులను కాదని తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడంతో ప్రతి ఒక్కరు ఈమెపై విమర్శించడం మొదలుపెట్టారు గనుక అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఫలితంగా ఇండస్ట్రీకి దూరం అయింది ఉదయభాను . ఆ తర్వాత ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఈమే ప్రస్తుతం వారి ఆలనా పాలన చూసుకుంటూ కుటుంబ జీవితానికి తన జీవితాన్ని పరిమితం చేసింది మొత్తానికైతే కుటుంబ సభ్యుల మాటలు వినకుండా ఒక డ్రైవర్ ను వివాహం చేసుకొని తన కెరీర్నే నాశనం చేసుకుందని చెప్పవచ్చు.