
ఆధ్యా అసలు పేరు ప్రీతి శర్మ. జనవరి 31 1999వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించింది. పుట్టింది లక్నోలో అయినా పెరిగింది , చదువు అంత తమిళనాడు లోని కోయంబత్తూర్ లో.. ఈమెకి ఒక సోదరుడు కూడా ఉన్నారు. ఎడ్యుకేషన్ పూర్తిచేసిన ప్రీతి శర్మ చిన్నప్పటి నుంచే నటన పైన, మోడలింగ్ పైన ఆసక్తి ఉండడంతో.. కాలేజ్ చదువుకున్న సమయంలోనే మిస్ హండ్లింగ్ కాంపిటీషన్లో పోటీ చేసి థర్డ్ ప్రైస్ గెలుచుకున్నారు. అలా మొదటిసారి తన కెరియర్ను మోడలింగ్ తో మొదలుపెట్టారు ప్రీతి. ఆ తర్వాత తన నటనతో, అందంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
టిక్ టాక్ వీడియోలు చేస్తూ టిక్ టాక్ స్టార్ గా ప్రేక్షకులను అలరించిన ప్రీతి ఆ తర్వాత కాలంలో మంచి ఫేమ్ తో పాటు సీరియల్స్ లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. నటన మీద ఆసక్తితో మొదట తమిళ బుల్లితెర సీరియల్స్ లోకి అడుగు పెట్టారు. తమిళ్లో పలు సీరియల్స్ లో నటించే అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి.. భారీ స్థాయిలో అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. అలాగే తమిళ మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి మెప్పించారు. అంతేకాదు పలు ఆల్బమ్ సాంగ్స్, యాడ్స్ లో కూడా ప్రీతి నటించారు. తెలుగులో పిన్ని 2 సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ఆల్ టైం ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయారు.