
ఇదిలా ఉండగా ప్రస్తుతం అలాంటి విమర్శలను ఎదుర్కొంటున్నారు యాంకర్ శ్యామల.. యాంకర్ శ్యామల గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అందంతో వాక్చాతుర్యంతో యువతను ఇట్టే ఆకట్టుకునే ఈమె సినిమాలలో కూడా నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. తన కెరియర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించిన ఈమె ఆ తర్వాత వెండితెరపై సినిమాలలో అవకాశాన్ని పొంది స్టార్ హీరోలకు అక్క, చెల్లి, వదిన పాత్రలతో నటించి మెప్పించింది.
ప్రస్తుతం సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈమె షో లలో అవకాశాన్ని అందుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించి యూట్యూబ్ ఛానల్ ద్వారా తన సంబంధించిన అన్ని వీడియోలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఈ విధంగా శ్యామల తన యూట్యూబ్ చానల్స్ ద్వారా గత ఏడాది జూలై నెలలో కొత్త ఇంట్లోకి చేరిన విషయాన్ని అభిమానులతో తెలియజేస్తూ వీడియోని అందరితో పంచుకుంది. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త ఇంటికి ఆమె శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు శ్యామల. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది ప్రశంసిస్తుంటే మరికొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు.
కొత్త ఇంట్లోకి వెళ్లి ఏడాది కూడా కాలేదు అప్పుడే మరో కొత్త ఇంటికి భూమి పూజ చేస్తున్నారా? ఇదెలా సాధ్యమండి అసలు అంత డబ్బు మీకు ఎలా ఎక్కడి నుంచి వస్తుంది అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.