వారి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.
కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించిన ప్రేమీ విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వంటలక్కగా భారీ పాపులారిటే దక్కించుకున్న ఈమె అంతకుమించి రెమ్యునరేషన్ ని కూడా సొంతం చేసుకుంటోంది. ఇక రోజుకు రూ.30 నుంచి రూ. 50 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంది ప్రేమీ విశ్వనాథ్.
ఇప్పుడు బుల్లితెర సీరియల్స్ లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కస్తూరి శంకర్ , రాశీ, సుహాసిని వంటి సీరియల్ హీరోయిన్స్ కూడా రూ. 25 వేల వరకు రోజుకు పారితోషకం పుచ్చుకుంటున్నారు. వీరి తరువాత అర్చన అనంత, శోభా శెట్టి తదితర నటీమణులు రోజుకు రూ.15 నుంచి రూ.20వేల వరకు పారితోషకం అందుకుంటున్నారు. ఇక వీరితోపాటు చాలామంది హీరోయిన్స్ ఇప్పుడు భారీగా పారితోషకం అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు సినిమాలలో కూడా సైడ్ క్యారెక్టర్ లో నటించే అవకాశాలను సొంతం చేసుకుంటూ వెండితెరపై కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.