టాలీవుడ్ బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్ గా మకుటం లేని మహారాణిగా గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా దూసుకుపోతున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్ గా ఏదైనా ఒక షో మొదలుపెట్టింది అంటే కచ్చితంగా అది సంవత్సరాల తరబడి సక్సెస్ అవ్వాల్సిందే. ఇప్పటికే క్యాష్ స్టార్ మహిళ వంటి ప్రోగ్రామ్స్ సుమాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఈమె ఎనర్జీ గురించి మాటల్లో చెప్పలేనిది. ఒకసారి ఈమెతో మాట్లాడాలంటే స్టార్ సెలబ్రిటీలు సైతం తడబడతారు.. అంతలా తన వాక్చాతుర్యంతో అందరిని ఆటపట్టిస్తూ అదరగొడుతూ నవ్విస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

స్టార్ హీరోయిన్ సమంత లాంటి హీరోయిన్ ని మెచ్చిన యాంకర్ సుమ. ఇక బెస్ట్ యాంకర్ గా గుర్తింపు శాంతం చేసుకున్న ఈమె సెలబ్రిటీలతో పాటు పాపులారిటీని దక్కించుకుంది.  వెండితెరపై కూడా పలు సినిమాలలో సహాయక పాత్రలో నటించిన సుమ కేవలం ఎంటర్టైన్మెంట్ షోలకే పరిమితం కాకుండా వెండితెరకు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్ లో కూడా మెరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా పలు సినిమా ఈవెంట్లకు ప్రత్యేకించి సుమను ఆహ్వానిస్తూ ఉంటారు. సుమ భవిష్యత్తు తరాల వారికి తన యాంకరింగ్ చూపించే సత్తా తనలో ఉందని అందరూ అంటూ ఉంటారు.

ఇదిలా ఉండగా సుమకు కష్టాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది . అసలు విషయంలోకి వెళితే ఈరోజు సోమవారం సందర్భంగా ఆమె ఒక ఫన్నీ వీడియో షేర్ చేసింది ..అంటే సోమవారం ఉదయం లేచి ఆఫీస్ కి వెళ్లాలనుకునే వాళ్లకు అస్సలు వెళ్లాలని అనిపించదు.. కాబట్టి అటువంటి వీడియోనే ప్రేక్షకులతో పంచుకుంది.. అందులో తాను మేకప్ రూమ్ లో కింద కూర్చొని నేను రాను నాకు రావాలని లేదు అంటూ సరదాగా డైలాగులు విసురుతూ కనిపించింది. రాను అని మారం చేస్తుండడంతో ఆమె మేకప్ ఆర్టిస్ట్ లు ఆమెను లాక్కెల్లిన వీడియో మనం చూడవచ్చు ఇది నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. దీన్ని చూసి పాపం సుమకు ఎంత కష్టం వచ్చిందో అంటూ అభిమానులు,  నెటిజన్లు కూడా సరదాగా డైలాగులు కొడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: