తొలి ప్రయత్నంతోనే దర్శకుడిగా మారి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన టాలెంట్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి ప్రజల అనుబంధాల కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కేవలం రెండు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా మరో కాంతారా అనిపించుకుంటుందని ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్న ఈ సినిమాను ఆస్కార్ కి పంపిస్తామని సినిమా నిర్మాత దిల్ రాజు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు డైరెక్టర్ వేణు కి అరుదైన గౌరవం లభించింది. తొలి ప్రయత్నం లోనే ఉత్తమ దర్శకుడిగా అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఉత్తమ దర్శకుడిగా వేణు ఆమ్ స్టర్ డం ఇంటర్నేషనల్ అవార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిలిం అలాగే బెస్ట్ ఫీచర్ ఫిలిం సినిమా ఆటోగ్రఫీ విభాగాల్లో కూడా అవార్డులను అందుకున్న ఈ సినిమా.. ఓనికో ఫిల్మ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. మొత్తానికి అయితే వేణు అనుకున్నది సాధించాడు అని చెప్పవచ్చు.