వి6 ఛానల్ ద్వారా తీన్మార్ సావిత్రిగా అందరికీ పరిచయమైన శివజ్యోతి.. బుల్లితెర షోలలో కూడా కనిపించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇక ఈమె గురించి మనం కొత్తగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. తన భాష తీరుతో మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ చీరకట్టుతో కూడా అందరిని అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బిత్తిరి సత్తితో కలిసి ఈమె చేసిన ఎన్నో షోలు భారీ సక్సెస్ను అందుకున్నాయి. తీన్మార్ వార్తలు ద్వారా తెలుగు రాష్ట్రాలలో మంచి అభిమానం కూడా ఏర్పరుచుకుంది శివజ్యోతి ఆ హోదాతోనే ఈమెకు బిగ్ బాస్ లో కూడా అవకాశం లభించింది ఇక అక్కడ తన టాలెంట్ను నిరూపించుకొని మంచి కంటెస్టెంట్ గా పేరు కూడా సొంతం చేసుకుంది.

అయితే బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక v6 తీన్మార్ వార్తలను వదిలేసి మరో చానల్లో అడుగుపెట్టిన ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో తనకు సంబంధించిన ప్రతి వీడియోని షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య తన గ్లామర్ షో చేయడం కూడా మొదలుపెట్టేసిందని చెప్పాలి. తెలంగాణకు చెందిన అచ్చమైన తెలుగు అమ్మాయి అయితే ఈ మధ్య గ్లామర్ షో చేయడం ఈమె కూడా మొదలు పెట్టేసింది చిట్టి పొట్టి బట్టలు ధరిస్తూ అందరిని అలరిస్తోంది.  రకరకాల ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది.

చాలాసార్లు ఈమె వేసుకున్న దుస్తుల పట్ల నెగెటివిటీ ఎదుర్కొన్న ఈమె ఒకప్పుడు చాలా పద్ధతిగా ఉండే దానివి ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యావు అనే కామెంట్లు కూడా ఎదుర్కొంటుంది. ఇదిలా ఉండగా ఒక నిటిజన్ అచ్చమైన తెలుగు అమ్మాయివి ఇప్పుడు ఇలాంటి బట్టలతో పరువు పోగొట్టుకోకు అని ఫైర్ అయ్యాడు. దీనికి ఘాటుగా స్పందించిన శివ జ్యోతి బట్టల్లో ఆత్మగౌరవం వెలువడదు బట్టలు చూసి ఇచ్చే గౌరవం అసలు అక్కర్లేదు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: