
ఈ కార్యక్రమంలో భాగంగా తన కెరీర్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది సుమ. సుమ కెరియర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్ ద్వారా తెగ సందడి చేయడం జరిగింది అలాగే యాంకర్ గా స్థిరపడి ఆధారవాత వెండితెరపై పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది సుమ.. ఇక జయమ్మ పంచాయితీ అనే చిత్రం ద్వారా తనకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచు చేయాలని ప్రయత్నించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఈమె తదిపరు సినిమాలో చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
దీన్ని బట్టి చూస్తే సుమ రాబోయే రోజుల్లో ఇక మీదట సినిమాలకు గుడ్ బై చెప్పి అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇందులో భాగంగానే సుమకు వెండితెరపై కనిపించడం కంటే బుల్లితెరపై యాంకర్ గా కనిపించడమే ఇష్టమే అని తెలియజేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ స్క్రీన్ పైన నటించడం ఏమాత్రం ఇష్టం లేదంటూ ఈ ఒక్క మాటతో తేల్చి చెప్పడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు. ఇక మీదట సినిమాలలో సుమ నటించబోదు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సుమ తన కొడుకుని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.