ఇకపోతే తాజాగా తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే వాటికి కొంతమంది పాజిటివ్గా స్పందిస్తుంటే మరి కొంతమంది నెగటివ్గా స్పందిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అలా నెగిటివ్గా స్పందించే వారికి పరోక్షంగా కౌంటర్ ఇస్తూ షాకింగ్ కామెంట్లు చేసింది రష్మీ.. తన ఇంస్టాగ్రామ్ ద్వారా.." నీతో ఉండేవాళ్లు ఉంటారు.. పోయే వాళ్ళు పోతారు. మహా అంటే వయసు మరో ఏడాది పెరిగింది.. జీవితంలో మరింత ముందుకు వెళ్లడానికే నేను ప్రయత్నాలు చేస్తున్నాను..నా పుట్టినరోజు ఎంతో స్పెషల్ గా మార్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తనదైన స్టైల్ లో నోట్ విడుదల చేసింది.
ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు తన గురించి నెగిటివ్ గా మాటలు స్ప్రెడ్ చేసేవారు ఏమైపోయినా తాను పట్టించుకోనని స్పష్టం చేసింది. మొత్తానికైతే నెగిటివ్ కామెంట్లకు ఈమె స్పందించడం లేదు అని చెప్పవచ్చు. ఇక రష్మీ ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ మళ్ళీ సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు అందుకోవాలని అభిమానుల సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.