మరీ ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ప్రేమీ విశ్వనాధ్ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధించే నటి అని చెప్పాలి. ఈ సీరియల్ లో దీప క్యారెక్టర్ లో ఒదిగిపోయింది. తనదైన కట్టుబొట్టుతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకున్న ఈమె డాక్టర్ బాబుతో ఆన్ స్క్రీన్ ప్రజెంట్ బుల్లితెర ప్రేక్షకుల మనసును దోచుకుంది. అంతేకాదు మహిళా మణులు ఈమె క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పాలి. నేషనల్ లెవెల్లో టిఆర్పి రికార్డులను కూడా కొల్లగొట్టింది ఈ సీరియల్. ఈ సీరియల్ రికార్డులను ఎవరు చెరపలేదు అని చెప్పవచ్చు.
ఇకపోతే సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఒక్కొక్క సీరియల్ ఎపిసోడ్ కు ఏకంగా లక్షకు పైగానే పారితోషకం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా మలయాళం సినిమాల్లో నటిస్తూ లక్షల కూడబెడుతున్న ఈమె స్టూడియోల ద్వారా బాగానే సంపాదించినట్లు సమాచారం. అంతేకాదు ఈమె ఆస్తులు విలువ సుమారుగా రూ. 50 కోట్లకు పైగానే ఉంటుందని రెండు లగ్జరీ కార్లు ఒక విలాసవంతమైన భవనం కూడా ఆమె సొంతమని సమాచారం. ఇక కార్తీకదీపం సీరియల్ కోసమే ఈమె కేరళ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చేదట. ఈమె ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేసింది. ఇక లాక్ డౌన్ కంటే ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల కాస్త లేటుగా విడుదల అయిందని సమాచారం.